ప్రేమ ముసుగు వేసుకుని ఉన్మాదంతో చెలరేగిపోయి మధులికపై కత్తితో దాడి చేసిన భరత్‌ను(19) రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడిని బుధవారం కాచిగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతణ్ని పూర్తిస్థాయిలో విచారించి మరిన్ని విషయాలు రాబట్టునున్నట్టు కాచిగూడ ఏసీపీ సుధాకర్ పేర్కొన్నారు.
ఈ నెల 6న కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యానగర్‌లో తన ప్రేమను నిరాకరించిన మధులికపై భరత్ కొబ్బరిబోండాల కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. మధులిక ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమెకు ఇన్ఫెక్షన్ సోకినట్టు చెప్పారు. కాగా, నిందితుడికి కఠిన శిక్ష పడాలని మధులిక తల్లిదండ్రులు కోరుతున్నారు. Telugu news Court granted permission to love psycho Bharat custody