బల్దియాకు అక్రమ బీఫ్.. ఫ్రమ్ విజయవాడ - MicTv.in - Telugu News
mictv telugu

బల్దియాకు అక్రమ బీఫ్.. ఫ్రమ్ విజయవాడ

December 5, 2017

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా  గోమాంసాన్ని తరలిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అంబర్ పేట వద్ద కంటైనర్ బోల్తాపడడంతో రోడ్డుపై గోమాంసం చెల్లాచెదురుగా పడిపోయింది.

విజయవాడలో గోవులను వధించి అక్కడ నుంచి కంటైనర్‌లో హైదరాబాద్‌కు అక్రమంగా గోమాంసాన్ని తరలించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బజరంగ్ దళ్, బీజేపీ తదితర  హిందూ పార్టీలు, సంఘాల  కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. అక్రమంగా గోమాంసం తరలిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.