ఈ డాక్టర్ ఎర్రజెండా ఎందుకు పట్టాడు? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ డాక్టర్ ఎర్రజెండా ఎందుకు పట్టాడు?

January 30, 2018

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏం చేసినా అది క్షణాల్లో మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినోళ్లు వేసిన కంచెను కాళ్లతో తన్నినా..యేడాది చికెన్ తినను అని ఒట్టు పెట్టుకున్నా, బాక్సింగ్ చేసినా..కల్లు తాగినా.. సైకిల్ తొక్కినా..తీన్మార్ డ్యాన్స్ చేసినా ఏదైనా క్షణాల్లో వైరల్ కావాల్సిందే. ఇవన్నీ మనకు తెలిసినవే.

కానీ నారాయణ జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో, మనకు తెలియాల్సిన విషయాలు ఎన్నో. డాక్టర్ విద్య చదివినవాడు.. ఎర్రజెండా ఎందుకు పట్టాడు ? ఒకప్పుడు  ఉపవాసాలతో..దేవుడిపై అమిత భక్తి కలిగిన నారాయణ  నాస్తికుడిగా ఎలా మారాడు ? నారాయణ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ‘నైతిక విలువలు ఉన్నాయి కాబట్టే అందర్నీ విమర్శిస్తాను. ఆ ఏడాది మీడియా నన్ను కాపు కాసింది ?’ అంటున్న నారాయణ  భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ?  ఇలా ఎన్నో విషయాలను ఆయన మైక్‌టీవీతో  పంచుకున్నారు..ఆ వీశేషాలన్నీ మీకోసం.