మైనర్ బాలికపై మిత్రులతో కలసి అత్యాచారం చేసిన ఓ సీపీఎం కార్యకర్త అమాయకుడిలా పోజు కొడుతూ.. ఆ బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసన ర్యాలీలో పాల్గొన్నాడు. పెద్ద పెట్టున నినాదాలూ కూడా చేశాడు. కేరళలోని కన్నూర్ జిల్లా పరసినికడవులో మంగళవారం సీపీఎం అనుబంధ యువజన విభాగం డీవైఎఫ్ఐ ర్యాలీ తీసింది. లాడ్జిలో ఒక అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆమెకు న్యాయం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. అందులో డీవైఎఫ్ఐ తలియిల్ ప్రాంత కార్యదర్శి నిఖిల్ మోహనన్ కూడా పాల్గొన్నాడు. రేప్ కేసులో పోలీసులు గురువారం నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో నిఖిల్ ఒకడు.
బాధతురాలిపై గత నెల 19న పరసినికడవులోని లాడ్జిలో సామూహిక అత్యాచారం జరిగింది. ఫేస్ బుక్లోపరిచయమైన యువకుడు ఆమెను అక్కడికి తీసుకెళ్లి మిత్రులతో కలసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వీడియో కూడా తీసి, ఆమె సోదరుడికి పంపాడు. డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేశారు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో మరో షాకింగ్ విషయం తెలిసిందిది. బాధితురాలపై ఆమె తండ్రి కూడా రెండేళ్ల నుంచి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఈ కేసులో ఇంతవరకు 13 మందిని అరెస్ట్ చేశామని, బాధితులిరాలపై దుండగులు లాడ్జీలోనే కాకుండా చాలా ఇళ్లలో అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
Telugu news CPM dyfi activist participate anti-rape protest in Kannur of Kerala arrested Nikhil Mohanan (Nikhil Thaliyil), secretary of a DYFI unit from Thaliyil in Kannur was seen marching with the small crowd