కేజీఎఫ్ హీరోతో క్రేజీ ముచ్చట.. విత్ మంగ్లీ.. - MicTv.in - Telugu News
mictv telugu

కేజీఎఫ్ హీరోతో క్రేజీ ముచ్చట.. విత్ మంగ్లీ..

December 16, 2018

కన్నడ సినిమాల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ హీరో. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి పెద్ద పెద్ద హిట్లు అందిస్తున్నాడు కన్నడ సినిమా ఇండస్ట్రీకి.

అతను ఒక బస్సు డ్రైవర్ కొడుకు. తన కొడుకు సూపర్‌స్టార్ అయినా కూడా ఆ తండ్రి ఇంకా బస్సు డ్రైవర్‌గానే పని చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ యూత్ ఫేవరేట్ హీరో అనుకుంటున్నారా.. యష్. తాజాగా తెలుగులో ‘కేజీఎఫ్’ సినిమాతో వచ్చాడు. మైక్ టీవీ ముచ్చటలో తన మనసులోని మాటలెన్నో మంగ్లీతో పంచుకున్నాడు. ఇప్పుడు తన తండ్రి ఓ సూపర్ స్టార్‌కు నాన్న కదా అంటే.. ఇంకా ఆయన అలా ఫీలవడం లేదన్నాడు. ఎందుకలా అంటే..

‘నాకింత పేరు వచ్చింది కదా నువ్వు మానేయొచ్చు కదా నాన్నా అంటే.. ఒరేయ్ నేను బస్ డ్రైవర్ అయ్యే నిన్ను సూపర్‌స్టార్‌ను చేశా.. నీ పని నువ్వు చూసుకో.. నా పని నేను చేసుకుంటా అన్నారు’ అని చెప్పాడు యష్ వాళ్ళ నాన్న గురించి. తెలంగాణ యాక్సెంట్‌లో మంగ్లీ అడిగిన ప్రశ్నలను బాగా ఎంజాయ్ చేశాడు యష్. తన కెరియర్ సీరియల్స్ నుంచి ప్రారంభమైంది అన్నాడు. సుమారు ఐదు సీరియళ్లల్లో నటించిన తనకు సినిమాల్లో హీరోగానే ఎంట్రీ వచ్చిందని చెప్పాడు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది తనను సపోర్ట్ చేస్తున్నారని అన్నాడు. దర్శకుడు రాజమౌళి, నిర్మాత సాయి కొర్రపాటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇలా ఎన్నో ముచ్చట్లను పంచుకున్నాడు యష్. అతనితో పాటు ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొని తమ భావాలను పంచుకున్నారు. క్రింది లింకులో మీరూ పూర్తి అంటర్వ్యూను చూడవచ్చు.

Telugu news Crazy interview with KGF hero with Mingli