ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై దాడి

అస్సాంలోని గువాహటిలో రెండో ట్వంటీ -20మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆసీస్ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సు అద్దం ధ్వంసమైంది. ఈ ఘటన గురించి ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ ట్వీట్  చేశారు. హోటల్‌కు వెళ్తున్న దారిలో గుర్తుతెలియని వ్యక్తులు బస్సుపై రాయి విసరడం చాలా ఆందోళన కలిగించిందని ఫించ్ తెలిపాడు. పగిలిన బస్సు అద్దం ఫోటోను తీసి కూడా ట్వీట్ చేశాడు. రాయి విసిరినప్పుడు విండో సీట్‌లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని,  ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ తన వెబ్‌సైట్ పేర్కొంది. కానీ ఈ ఘటన క్రికెటర్లను భయబ్రాంతులకు గురి చేసినట్టు తెలిపింది. ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేస్తున్నట్లు చెప్పారు.  క్రికెటర్లకు కల్పించే  భద్రతపై తాము సంతృప్తిగా ఉన్నట్టు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది.

SHARE