విరాట్ మరో అదిరిపోయే రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

విరాట్ మరో అదిరిపోయే రికార్డు

December 2, 2017

భారత్ క్రికెట్ సారథి విరాట్ కోహ్లి సరికొత్త రికార్డును సృష్టించాడు. టెస్టుల్లో 5 వేల పరుగులను పూర్తి చేసిన 11వ భారత్ ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 25 పరుగులు చేసి ఈ రికార్డును అందుకున్నాడు.విరా‌ట్‌కు ఈ టెస్ట్ 63వది. అతడు 104 ఇన్సింగ్స్ ల్లో 4,975 పరుగులు చేశాడు. తాజా 105వ ఇన్నింగ్స్‌లో  లక్మల్ వేసిన 30.3వ బతిని బౌండరికి పంపి 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తొందరంగా ఈ రికార్డు చేరుకున్న నాలుగో బ్యాట్స్ మన్ విరాట్ కావడం విశేషం. సునీల్ గావస్కర్ ( 95 ఇన్నింగ్స్ ల్లో) సెహ్వాగ్ (98),సచిన్ (103) లో ఈ రికార్డు సాధించారు. సమయంలో పరంగా చూస్తే భారత్ తరపున ఆడతున్న కోహ్లి 2,358 రోజుల్లో ఈ రికార్డు సాధించాడు. ద్రావిడ్ ( 2,252 రోజులు)  ముందున్నాడు.