వన్డే చరిత్ర.. ఒక్కడు 23 సిక్సర్లు, 257 పరుగులు - MicTv.in - Telugu News
mictv telugu

వన్డే చరిత్ర.. ఒక్కడు 23 సిక్సర్లు, 257 పరుగులు

September 28, 2018

23 సిక్సులు,15 ఫోర్లు,148 బంతులు, 257 పరుగులు. ఇది మొత్తం టీం స్కోర్ కాదు. ఒకేఒక్కడి స్కోర్. బౌలర్ ఎవ్వరైనా.. బంతి ఎలా వేసినా.. బంతి బౌండిరికే. అతని బాదుడికి బౌలర్లకు చుక్కలు కనిపించాయి. అతగాడు ఆడే ఆటకి ముచ్చెమటలు పట్టాయి. ఆస్ట్రేలియా ఆటగాడు డి ఆర్కీ షార్ట్ లిస్ట్ – ఎ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు.

వెస్టర్న్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) తరుపున బరిలోకి దిగిన డీ ఆర్కీ చెలరేగిపోయాడు. క్వీన్స్లాండ్ బౌలర్లు వేసిన బంతి వేయడమే ఆలస్యం బౌండరీని దాటించేశాడు. మొత్తం 148 బంతుల్లో ఆర్కీ 23 సిక్సర్లు, 15 ఫోర్లతో ఏకంగా 257 పరుగులు చేశాడు. దీంతో డబ్ల్యూఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్ల్యాండ్ 271 పరుగులకు ఆలౌటైంది.

D’arcy Short hammers record double ton in Australian domestic tournament

ఇప్పటి వరకు ఒక ఇన్నింగ్స్‌లో ఒక బ్యాట్స్మన్ 23 సిక్సర్లు కొట్టడం వన్డే క్రికెట్లో చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో కివీస్ ఆటగాడు కోలిన్ మున్రో దేశవాళీ క్రికెట్ ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్లో 23 సిక్సర్లు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో 200 పైగా పరుగులు చేసిన జాబితాలో సర్రే ఆటగాడు అలీ బ్రౌన్ (268), భారత ఆటగాడు రోహిత్ శర్మ (264) ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా తరపున డబుల్ సెంచరీ సాధించిన వారిలో బెన్ డంక్, ఫిలిప్ హ్యూస్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. ఈ జాబితాలో డి ఆర్కీ షార్ట్ కూడా చేరాడు.