సెక్సియస్ట్ కామెంట్లు.. హార్థిక్ పాండ్యా క్షమాపణ

యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా వివాదంలో ఇరుక్కున్నాడు. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో తొలిసారిగా ఇద్దరు క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదం అయింది. దీనితో మహిళల పట్ల తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో భారత ఆల్‌రైండర్ హార్ధిక్ పాండ్య క్షమాపణ చెప్పారు. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.Telugu News cricketer hardik pandya asked apology for his comments in koffee with karan talk showటాక్ షో లో కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యాను తన లవ్‌స్టోరీ గురించి అడగ్గా ‘నేను ఈ మధ్యకాలంలో అమ్మాయిల గురించి మూడు విషయాలను తెలుసుకున్నా… మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్‌ చేయడం. మూడోది రిలేషన్‌షిప్‌” అని చెప్పుకొచ్చాడు. అయితే పాండ్యా చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే కాకుండా, భారత సంస్కృతిని దిగజార్చాలే ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ల్స్ చేస్తూ పాండ్యాను ఏకిపారేస్తున్నారు. టాక్ షోలో తన వ్యాఖ్యల పట్ల హార్ధిక్ పాండ్య క్షమాపణ చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశాడు. టాక్ షో నేటివిటీని కొనసాగించే ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశానంటూ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చుకున్నాడు.Telugu News cricketer hardik pandya asked apology for his comments in koffee with karan talk show