చిరుత పిల్లకు కెవిన్ పీటర్సన్ తండ్రి అయ్యాడు..   - MicTv.in - Telugu News
mictv telugu

చిరుత పిల్లకు కెవిన్ పీటర్సన్ తండ్రి అయ్యాడు..  

February 27, 2018

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ చిరుత పిల్లను దత్తత తీసుకున్నాడు. భారత్‌లోని రాయ్‌పూర్‌  ప్రాంత నుంచి పీటర్స్న్ చిరుత పిల్లను దత్తత తీసుకున్నాడు.  కొద్ది వారాల క్రితమే అటవీ అధికారుల నుంచి తనకు ఈ అవకాశం దక్కింది. ‘భారత్‌లో ఒక్క జనవరిలోనే సుమారు 40 చిరుతలు చనిపోయినట్లు చదివాను. ఇందులో ఎక్కువ శాతం వేటగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాయి. అప్పుడే నేను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని గత వారం పీటర్సన్‌ తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నాడు.

తాజాగా భారత్‌ వచ్చిన పీటర్సన్‌ చిరుత పిల్లను దత్తత తీసుకున్నాడు. ఈ మేరకు పీటర్సన్‌ ‘చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న చిరుత ఎంత అందంగా ఉందో’ అని  తన ట్విటర్ లో చిరుత పిల్లకు పాలు తాగించే  వీడియోను పోస్టు చేశాడు. అనంతరం పీటర్సన్‌ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, బాలీవుడ్‌ కథానాయకుడు అభిషేక్‌ బచ్చన్‌ను కలిసి ఫోటోలను దిగాడు.

www.instagram.com/p/BfpvBqtjvLc/?taken-by=kp24r, adapt, chattish gad