విరాట్‌ పెళ్లి ఇటలీలో... - MicTv.in - Telugu News
mictv telugu

విరాట్‌ పెళ్లి ఇటలీలో…

October 27, 2017

భారత క్రికెటర్  విరాట్ కోహ్లి , బాలీవుడ్ భామ అనుష్క శర్మ వివాహం  చేసుకుబోతున్నారు అని వార్తలు వచ్చాయి కదా. అది నిజమేనని తేలింది. డిసెంబర్‌లో శ్రీలంకతో టీమిండియా సిరీస్ ఉంది. ఆ సిరీస్‌లో ఆడలేనని తనకు సెలవులు కావాలని విరాట్ క్రికెట్ బోర్డుకు లీవ్ లెటర్ పెట్టాడు.

మాంచి ఫామ్‌లో ఉన్నక్రికెటర్ ఇలా సెలవులు ఎందుకు పెడుతున్నాడు అని ఆరా తీస్తే పెళ్లి కోసమే అని తెలిసింది. డిసెంబర్‌లోనే అనుష్క శర్మ కూడా షూటింగులు పెట్టుకోకుండా వ్యక్తిగత జీవితానికి కాల్‌షిట్స్‌ను కేటాయించారని తెలిసింది. ఇద్దరు డిసెంబర్‌లో పెళ్లి చేసుకునేది ఖాయమని తెలిసింది. పెళ్లి ఇండియానే అయితే  కాదు … ఇటలీలోని మిలాన్ సిటిలో పెళ్లి చేసుకుంటారని  టాక్. మిలాన్ వరల్డ్ ఫ్యాషన్ క్యాపిటల్  సిటిగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే అక్కడ వివాహం చేసుకుంటున్నారు.  ఇప్పటివరకు ఈ విషయంపై విరాట్, అనుష్క  ఏం స్పందించకపొయే సరికి నిజమే అనుకుంటున్నారు అభిమానులు.