రవీంద్ర జడేజా.. ఇదేం పని? - MicTv.in - Telugu News
mictv telugu

రవీంద్ర జడేజా.. ఇదేం పని?

December 13, 2017

భారత్ క్రికెటర్ రవీంద్ర జడేజా నిన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వివాదాస్పద  ఫోటోను   పోస్టు చేశాడు. తన ఫామ్ హౌజ్‌లో సేదదీరుతూ, హుక్కా తాగుతున్న ఫోటో పెట్టాడు. దీన్ని చూసిన  నెటిజన్లు విమర్శల దాడి చేస్తున్నారు. జడేజాను ఎంతో మంది చిన్నారులు ఆదర్శంగా తీసుకుంటారని, ఇలాంటి ఫోటోలు పెట్టడం జడేజా వంటి వారికి తగదని అంటున్నారు. హుక్కు తాగేవారిని చూసి పిల్లలు  కూడా అడ్డదారి తొక్కే అవకాశాలు ఉన్నాయని జడేజాకు హితబోధ చేస్తున్నారు.

సెలబ్రిటి అన్నాక కొన్ని నింబంధనలు పాటించాలని, ఇలాంటి ఫోటోలకు పిల్లలు సులభంగా ఆకర్షితులు అవుతారని మరికొంతమంది నెటిజన్లు విమర్శించారు. వారి జీవితాలను ప్రభావితం చేసే పోటోలను పెట్టదని  జడేజాకు విజ్ఞ‌ప్తి చేశారు. కొంతమంది మాత్రం సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారి  జీవితాన్ని వారికి నచ్చిన విధంగా  ఉండే స్వేచ్ఛ వారికి ఉందని మద్దతు  తెలిపారు.