విరుష్కల ఆదాయం వెయ్యి కోట్లు... - MicTv.in - Telugu News
mictv telugu

విరుష్కల ఆదాయం వెయ్యి కోట్లు…

December 13, 2017

భారత్ క్రికెట్ సారథి విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెళ్లి బంధంతో ఒక్కటైన ముచ్చట తెలిసిందే. ఇద్దరూ తమ వృత్తుల్లో అగ్రస్థానంలో ఉన్నవారే. తమకున్న క్రేజ్‌‌తో ఇప్పటికే ఈ ఇద్దరూ దాదాపుగా రూ. 600 కోట్లు ఆస్తులను  సంపాదించారు. ఫినాఫ్ రిపోర్ట్ ప్రకారం విరాట్ ఆస్తులు విలువ రూ. 382 కోట్లు. అనుష్క ఆస్తుల విలువ రూ. 220 కోట్లు. మరో రెండేళ్లలో వీరిద్దరి ఆస్తుల విలువ రూ. 1000 కోట్లు అయ్యే అవకాశం ఉందని బ్రాండ్ ఎనలిస్ట్‌లు అంటున్నారు.  

వరల్డ్ బెస్ట్  బ్యాట్స్‌మెన్ విరాట్ ప్రతి ఏడాది రూ. 120  కోట్లు సంపాదింస్తున్నాడు. ట్వీట్లు, ఇన్ స్టాగ్రామ్  పోస్టులతో బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు,ప్రకటనల ప్రకారం కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇవే కాకుండా విరాట్‌కు ‘రాంగ్’ పేరిట దుస్తుల వ్యాపారం ఉంది. ముంబైలో ‘న్యూవా’ రెస్టారెంట్, ‘చీజిల్’ పేరిట జిమ్ నడుపుతున్నాడు. రూ. 9 కోట్లు విలువ చేసే ఆరు కార్లు ఉన్నాయి.

అనుష్క శర్మ కూడా ఈ మద్యే ‘నుష్’ పేరిట దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది. ‘ క్లీన్ స్లేట్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలను నిర్మించింది. అనుష్క ప్రతి సినిమాకు పారితోికంగా రూ. 10 కోట్లును, బ్రాండ్లకు రూ. 4 కోట్లనూ తీసుకుంటుంది.అంతేకాక ముంబై నగరంతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆమెకు సొంత వ్యాపారాలు ఉన్నాయి. వాటి నుంచి దాదాపుగా రూ. 40 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. అనుష్క వద్ద రూ. 5 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ , మెర్సిడెజ్ కార్లు ఉన్నాయి.

భవిష్యత్తులో విరాట్‌ వార్షిక ఆదాయం 140 శాతం పెరుగుతుందని అంచనా. అనుష్క ఆదాయం ఈ మూడేళ్లలో 80శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో ఆమె ఆదాయం 18 శాతనికి పెరగనుంది. విరాట్‌, అనుష్క విడిగా ఉన్నప్పుడే తమ కెరీర్లను చక్కగా మలుచుకుంటూ ఇంతటి ఆదాయం సంపాదించారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైన వీరిద్దరినీ ఎన్నో అవకాశాలు వరిస్తాయి. ఇండస్ట్రీలో ‘పవర్‌ కపుల్‌’గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్‌, అనుష్క ఇప్పటికే 28 బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు ఇద్దరూ కలిసి బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.