విరుష్క జంట పెళ్లి ఆల్రెడీ అయిపోంది... - MicTv.in - Telugu News
mictv telugu

విరుష్క జంట పెళ్లి ఆల్రెడీ అయిపోంది…

December 11, 2017

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల  పెళ్లి గురించే లోకంమతా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో  ఎక్కడా ఈ చర్చే. ఈ నెల 12 ( రేపు) ఇటలీలోని  బోర్గో ఫినోఛీటోలో ‘ విరుష్క’ల పెళ్లి‌కి సర్వం సిద్దమైందని.. అక్కడి రిసార్టులో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారని చర్చ జరుగుతోంది..

ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు షాకింగ్ విషయం చెప్పాడు. ‘విరాట్, అనుష్కల పెళ్లి జరగబోవడం కాదు. వారి పెళ్లి తంతు శనివారమే జరిగిపోయింది.. ’ అని ట్వీట్ చేశాడు. త్వరలో ఈ విషయాన్ని విరుష్క అధికారులు ప్రకటిస్తారని చెప్పాడు.  డిసెంబర్ 9-12  తేలదీల మధ్య వీరి వివాహం జరుగుతుందని  ప్రచారం కావడం  తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్త ఆసక్తికరంగా మారింది.

కాగా డిసెంబర్ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ కార్యక్రమంను నిర్వహించనున్నారు.ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెటర్లు, బాలీవుడ్ తారాగాణం హజరు కానున్నారు. పెళ్లికి సచిన్, యువరాజ్ సింగ్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లను ఆహ్వనించారని వార్తలు వచ్చాయి. కానీ  అవన్నీ నిజం కాదని తెలిసిపోయింది.