కోహ్లీ తప్పేం లేదు   - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ తప్పేం లేదు  

November 3, 2017

ఢిల్లీలోని తొలి టీ20 మ్యాచ్  సందర్బంగా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వాకీటాకీలో మాట్లాడం వివాదస్పదంగా మారింది.  ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో  కోహ్లి డగౌట్లో వాకీటాకీ మాట్లాడుతూ కనిపించాడు.  ఈ వివాదంపై  ఐసీసీ క్లీన్‌చిట్ ఇచ్చింది. డ్రెసింగ్ రూమ్ , డగౌట్ మధ్య సమాచారం అటూ,ఇటూ చేరవేయడానికి సహాయ సిబ్బంది వాకీటాకీలు వాడుతారు.

కోహ్లీ వాకీటాకీలో మాట్లాడేందుకు   అనుమతి  తీసుకున్నాడని  ఐసీసీ అధికారి తెలిపారు. మ్యాచ్ సందర్బంగా ఓ సమాచార సాధనాన్ని ఉపయోగించడం ద్వారా కోహ్లీ ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించాడని  మీడియాలో వార్తలు వచ్చాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్‌రూమ్‌లో మెుబైల్ ఫోన్లు కూడా వాడకూడదు.