పెళ్లిపీటలు ఎక్కనున్న జహీర్ ఖాన్..! - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిపీటలు ఎక్కనున్న జహీర్ ఖాన్..!

September 14, 2017

భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ , బాలీవుడ్ నటి సాగరిక ఘట్జే నవంబరులో పెళ్లిపీటలెక్కనున్నారు. ఇప్పటికే వీరు పెళ్లి పనుల్లో చాలా బిజీ అయిపోయారట. ఈ ఏడాది ఏప్రిల్ 25న నిశ్చితార్థం జరిగినట్టు ట్వీట్టర్ ద్వారా జహీర్ వెల్లడించారు. పెళ్లి మాత్రం కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితుల మధ్య నిర్వహించనున్నారు. కానీ పెళ్లి జరిగే తేదిని మాత్రం ఇంకా ప్రకటించలేదు.పెళ్లి తర్వాత జహీర్ జోడి ప్రత్యేకంగా స్నేహితుల కోసం పుణె లో రిసెప్షన్ ను నవంబర్ 27 న నిర్వహించనుంది.

ఐపీఎల్ జరిగే సమయంలో ఒక రోజు జహీర్… సాగరికను గోవాకు తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. జహీర్ ప్రేమను సాగరిక అంగీకరించడంతో ఐపీఎల్ అనంతరం పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. జహీర్ , సాగరిక జంటగా యువరాజ్ పెళ్లికి కూడా హాజరయ్యారు. సాగరిక ‘చక్ దే ఇండియా’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే.