రషీద్  శభాష్.. రివార్డు సొమ్ము స్నేహితుడికి - MicTv.in - Telugu News
mictv telugu

రషీద్  శభాష్.. రివార్డు సొమ్ము స్నేహితుడికి

April 13, 2018

మనకు నగదు అవార్డులు  వస్తే ఏం చేస్తాం? అవసరమున్న వస్తువులను కొనుక్కుంటాం. కానీ ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు వచ్చినః ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’  నగదును ఆపదలో ఉన్న స్నేహితుడికి, అతడి కుమారుడికి అందజేసి పెద్ద మనసు చాటుకున్నాడు. .గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ఆయనకు రూ. లక్ష నగదు అందజేశారు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రషీద్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీయడం విశేషం.

‘అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. వారు ఏ లీగ్‌లో ఆడినా మద్దతిస్తున్న అందరికీ ధన్యవాదాలు. నా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’ను ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడికి, అతడి కుమారుడికి అంకితం ఇస్తున్నాను. ఆ‍స్పత్రి ఖర్చుల నిమిత్తం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నగదు ఇస్తాను’ అని  తెలిపాడు. రషీద్‌ మంచి క్రికెటరే కాదు. మంచి మనసున్న వ్యక్తి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.