యువకులతో  గల్లీలో క్రికెట్ ఆడిన సచిన్... - MicTv.in - Telugu News
mictv telugu

యువకులతో  గల్లీలో క్రికెట్ ఆడిన సచిన్…

April 17, 2018

కొందరు ఎంత ఎత్తు ఎదిగిన కూడా ఒదిగి ఉంటారు. అందుకు నిదర్శనమే క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్  గల్లీలో క్రికెట్ ఆడారు. ఏంటి సచిన్ గల్లీ‌లో క్రికెట్ ఆడడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన సచిన్ సరదాగా గల్లీలో యువకులతో క్రికెట్ ఆడారు. సచిన్ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న సమయంలో  గల్లీలో కొందరు యువకులు క్రికెట్ ఆడుతూ కనిపించారు. సచిన్ వెంటనే కారు ఆపి దిగేసి వారి దగ్గరకు వెళ్లారు. ఓ యువకులతో కలిసి సరదాగా మాట్లాడారు. బ్యాట్ తీసుకుని సరదాగా వారితో గల్లీలో క్రికెట్ ఆడారు.

సచిన్ క్రికెట్  వదిలేసి ఐదేళ్లవుతున్నా తనలోని టెక్నిక్ సత్తా ఏ మాత్రం తగ్గలేదని ఆ గల్లీ క్రికెట్‌లో మరోసారి  చూపించారు. ఇక, ఆట అనంతరం పలువురు యువకులతో ఆయన సెల్ఫీలు దిగారు.