కోర్టులో పెళ్లి చేసుకున్న జహీర్‌ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టులో పెళ్లి చేసుకున్న జహీర్‌ఖాన్

November 23, 2017

క్రికెటర్ జహీర్‌ఖాన్, నటి సాగరిక ఘాట్గే  పెళ్లితో ఒక్కటయ్యారు. ఎలాంటి ఆర్భాటాల్లేకుండా సింపుల్‌గా కోర్టులో ఏడడుగులు వేసి పెళ్లి చేసుకున్నారు.  కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు.  కోర్టులో ఎందుకు పెళ్లి చేసుకున్నది మాత్రం ఇంకా చెప్పలేదు.రిసెప్షన్ మాత్రం  ఈ నెల 27న చాలా గ్రాండ్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు కూడా బయటకు వచ్చింది.  ఈ రిసెప్షన్‌కు క్రికెటర్లు, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ జంట పెళ్లి తర్వాత వచ్చిన తొలి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.