పార్లమెంట్‌ను కుల్చేయండి... - MicTv.in - Telugu News
mictv telugu

పార్లమెంట్‌ను కుల్చేయండి…

October 17, 2017

దేశంలలో ముస్లింలు నిర్మించిన కట్టడాలపై రాజకీయ వివాదం ముదురుతోంది. వాటిని కట్టిన వాళ్లకు ఏ ఉద్దేశాలున్నాయో ఏమో గాని, మన నేతలు మాత్రం రేయింబవళ్లు వాటినే కలవరిస్తున్నారు.  చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను దేశ ద్రోహులు కట్టారని, అది కట్టు బానిసత్వానికి నిదర్శనమని ఉత్తరప్రదేశ్ బిజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.  అది మరిచిపోక ముందే సమాజ్‌వాదీ పార్టీ  నేత ఆజం ఖాన్ అందుకు కౌంటర్‌గా చాలా వివాదాస్పదంగా మాట్లాడారు.

‘తాజ్‌మహల్ దేశద్రోహులు కట్టిందైతే రాష్ట్రపతి భవనం కూడా బానిసత్వానికి ప్రతీకే. గత పాలకులు నిర్మించిన చారిత్రక నేపథ్యం ఉన్న అన్ని కట్టడాలను కూడా కూల్చివేయాలి’ అని డిమాండ్ చేశారు.  బానిసత్వానికి గుర్తుగా ఉన్న పాలకుల కట్టడాలను తొలిగించాలని , గతంలోనూ తాను ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. పార్లమెంట్ ఒక్కటే కాదు, కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్ , ఎర్రకోట సహా తాజ్‌మహల్ అన్నింటినీ కూల్చి వేయాలని డిమాండ్ చేశారను. అయిన వీరు ఇలా ఒకరిని మించి ఒకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేసి చారిత్రక కట్టడాలను అవమానిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.