mictv telugu

నడిబజారులో నరమాంస దుకాణం.. ఆన్‌లైన్‌లోనూ

February 12, 2019

అదో పెద్ద దుకాణం.. పుర్రెకో బుద్ధి, ఉలిపికట్టె బాపతు మనుషులకు అక్కడేం కావాలన్నా దొరుకుతుంది. ముఖ్యంగా నరమాంసం, దానితో తయారు చేసిన ఊరగాయలు, ఎముకలు, పుర్రెలు, పిండాలు, అండాలు.. నానా జంతు విశేషాలు లభిస్తాయి. అదేదో చాటుమాటుగా సాగే వ్యవహారం కాదు. నడిబజారులో పబ్లిగ్గా, చట్టబద్ధంగా నడుపుతున్న దుకాణం.. ఇంగ్లండులో ఎసెక్స్ నగరంలో మాల్టింగ్స్ రోడ్డులో ఉంది. పేరు క్యూరియాసిటీస్ ఫ్రమ్ ద ఫిఫ్త్ కార్నర్.

హెన్రీ స్ర్కాగ్ దాని యజమాని. సరుకులకు తగ్గట్టే భీకర, చిత్రవిచిత్ర వేషధారణతో కస్టమర్లను పిలుస్తుంటాడు. పది పౌండ్ల నుంచి 2 వేల పౌండ్ల వరకు పలుకుతుంటాయి అతని సరుకులు. నరమాంసం అమ్ముతాడు.. అని అంటే జనాన్ని చంపి అమ్ముతాడని కాదు.

శవాల అవశేషాలను, ముఖ్యంగా ఆస్పత్రుల నుంచి, శ్మశానాల నుంచి సేకరించిన శరీర భాగాలను, గిరిజనులు, మాజీ మంత్రగాళ్లు వంటి వారు సేకరించిన నానా చెత్తాచెదారాన్ని అమ్ముతుంటాడన్నమాట. మనుషుల అవయవాలను హెన్రీ.. ఆల్కహాల్, ఫార్మల్డీహైడ్, డిస్టిల్డ్ వాటర్ వంటి రసాయనాల్లో జాగ్రత్తగా భద్రపరుస్తుంటాడు.

‘ఇది చిత్రమైన వ్యాపారమే. కానీ ఇందులో మజా ఉంది. వైద్యులు, పరిశోధకులు నా వద్దకు వస్తుంటారు. వారికి కావాల్సినవి తీసుకుపోతుంటారు. ఈ లోకం చిత్రమైంది గురూ.. చాలామంది చాలావాటిని ఇలా వదిలేసి పోతుంటారు. వాటి కోసం మరికొందరు పాకులాడుతుంటారు… ఈ వ్యాపారమే ఎందుకు చేస్తున్నానంటే.. మరేమీ చేయలేక.. ఈ వ్యవహారం చాలా క్రూరం, ఘోరం అని అంటారు. కానీ, వాటి కోసమే జనం వచ్చిపోతుంటారు…’ అని అంటాడు హెన్రీ. అతగాడి వ్యాపారం కేవలం షాపుకే పరిమితం కాదు. ఓ వైబ్ సైట్ కూడా వెలబెడుతున్నాడు. Telugu news  Curiosities from the 5th CornerInside the Essex shop selling pickled human body parts, flesh and animal skulls