హైదరాబాద్ పాతబస్తీలో దొంగ ఓట్ల కలకలం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ సజావుగా సాగిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే హైదరాబాద్ పాతబస్తీలో దొంగ ఓట్ల కలకలం రేగింది. సిరా చుక్క చెరిపేసి కొందరు మహిళలు వందల సార్లు దొంగ ఓట్లు వేశారు.Telugu News Cycling polling in Hyderabad Old City.. Election Commission Seriousచార్మినార్‌, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఈ సైక్లింగ్‌ పోలింగ్‌ జరిగింది.దొంగ ఓట్లపై తెెలంగాణ ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.