ఆటలాడితే శరీరానికి మంచి వ్యాయామం అని అందరికీ తెలుసు, కానీ నేటి టెక్నాలజీ యుగంలో చిన్న పిల్లల నుండి పండు ముసలివాళ్ల దాక అందరూ టెక్నాలజీకి బానిసైన వారే. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అదే పెద్ద వ్యాయామం అని అనుకుంటారు చాలామంది. కూర్చున్న చోటునుండి లేవకుండా శరీరానికి తగిన శ్రమ ఇవ్వకుండా ముప్పై ఏండ్లు దాటకముందే మూలుగుతున్నారు.
అయితే టెక్నాలజీకి తగ్గట్టుగానే శరీరానికి ఓవైపు వ్యాయామం,మరోవైపు మనసుకు ఉల్లాసం కలిగించే ఎన్నో ఆటలు మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందులో హైద్రాబాద్లో ఉన్న సైక్లింగ్ & స్కేట్ బోర్డ్ పార్క్ ఒకటి. ప్రపంచ చాంపియన్చే నిర్మాణం అయిన ప్రత్యేకమైన ట్రాక్. ఇండియాలోనే ఇదే ప్రత్యేకమైన ట్రాక్. ఈ వాల్ రైడ్ పార్క్ చిన్నపిల్లల నుండి పెద్దల దాక అందరిని అలరిస్తోంది. సైక్లింగ్, స్కేటింగ్ చేస్తే ఓ వైపు వ్యాయామం, మరోవైపు ఉల్లాసం వస్తుండడంతో యువత ఎక్కువగా ఈ అడ్వెంచర్ ఆటపై మక్కువ చూపిస్తున్నారు.