దలేర్ మెహందీకి రెండేళ్ల జైలుశిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

దలేర్ మెహందీకి రెండేళ్ల జైలుశిక్ష

March 16, 2018

ప్రముఖ పంజాబీ పాప్ గాయకుడు దలేర్ మెహందీకి కోర్టు జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా  కేసులో పటియాలా హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష వేసింది. 1998 నుంచి 1999 వరకు దాదాపు 15 మందిని చట్ట విరుధ్దంగా అమెరికా,కెనడా దేశాలకు తీసుకెళ్లి విడిచిపెట్టినట్లు  కేసులు నమోదయ్యాయి. ముగ్గురు బాలికలను శాన్‌ఫ్రాన్సిస్కోకు, ముగ్గురు బాలురను న్యూజెర్సీకి అక్రమంగా తీసుకెళ్ళినట్లు నిర్థారణ కావడంతో అతణ్నిదోషింగా తేల్చింది కోర్టు. దలేర్‌పై ఇలాంటి మరికొన్ని కేసులు విచారణలో ఉన్నాయి.దలేర్ మెహందీ, అతని  సోదరుడు షంషేర్ విదేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. సంగీత బృందంతోపాటుగా కొందర్ని చట్ట విరుద్దంగా అమెరికా తీసుకెళ్లినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. ఇందు  కోసం దలేర్, షంషేర్‌లు భారీగా డబ్బులు తీసుకునేవారని తెలిపారు. అలాగే కొందరిని విదేశాలకు తీసుకెళ్తామని చెప్పి మోసం చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దలేర్, షంషేర్ లు తమను మోసం చేశారని 35 మంది కేసులు పెట్టారు.