పిండంతో ఠాణాకు వెళ్ళిన రేప్ బాధితురాలు - MicTv.in - Telugu News
mictv telugu

పిండంతో ఠాణాకు వెళ్ళిన రేప్ బాధితురాలు

April 5, 2018

రోజురోజుకు మగాళ్ల తీరు రాక్షసత్వానికి పరాకాష్టగా మారుతుంది అనటానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. 16 ఏళ్ళ దళిత అమ్మాయిని ఓ నీచుడు కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారారనికి పాల్పడ్డాడు. అలా పలుమార్లు తన కోరిక తీర్చుకొని కడుపు చేశాడు. కడుపు చేసిందే గాక అత్యంత క్రూరంగా అబార్షన్ చేయించి ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. కానీ ఆ అమ్మాయి ధైర్యంగా సంచిలో వున్న పిండాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది.మనసులను కదిలిస్తున్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఆ దళిత అమ్మాయి పేరు సాత్న. ఆమె మీద ఎప్పటినుంచి దుష్ట కన్ను వేశాడో గానీ అతడు ఒకరోజు ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పలుమార్లు బెదిరిస్తూ అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని సాత్న పోలీసుల ముందు చెప్పినా వారు స్పందించలేకపోయారు. ఈ క్రమంలో సాత్న గర్భవతి అయ్యింది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె తన తల్లితో ఆసుపత్రికి వెళుతోంది. దారి మధ్యలో తన అనుచరులతో అడ్డుకున్నాడు ఆ రాక్షసుడు.

అక్కడినుంచి ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి బలవంతంగా అబార్షన్ చేయించాడు.  అబార్షన్ చేశాక.. డాక్టర్ పిండాన్ని ఓ సంచిలో వేసి తన చేతిలో పెట్టాడు. దాన్ని నాలాలో పడేయమని చెప్పి ఆటో ఛార్జీ కోసం రూ.20 ఇచ్చి అక్కడి నుంచి గెంటేశారు. అబార్షన్ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావ్ అని బెదిరించారు. దీంతో ఆ బాలిక ఆ పిండం వున్న సంచీతో ఎస్పీ ఆఫీస్‌కు వెళ్ళింది. సంచిలో వున్న పిండాన్ని చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. నిందితుడు నీరజ్ పాండేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.