mictv telugu

డాన్స్ చేస్తూ మురికి కాలువలో పడ్డ వరుడు..  

February 11, 2019

పెళ్లి వేడుకలో నిర్వహించిన బరాత్‌లో డాన్స్ చేస్తున్న వారంతా ఒక్కసారిగా మురికి కాల్వలో పడిపోయారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇందిరాపురానికి చెందిన అమిత్ యాదవ్‌కు సోనమ్ అనే యువతితో ఫిబ్రవరి 9న పెళ్లి కుదిరింది. బంధువులందరూ పెళ్లి వేదిక దగ్గరకు చేరుకున్నారు.  ఫంక్షన్ హాల్‌కు, రోడ్డుకు మధ్య మురుగు కాలువ ఉంది. దీంతో పెళ్లికి వచ్చే వారికి కోసం కాల్వపై తాత్కాలిక బ్రడ్జిని ఏర్పాటు చేశారు. పెళ్లి వేదికపై వరుడ్ని ఆహ్వానించేందుక వధువు తరపు బంధువులు ఫంక్షన్ హాల్ ఎదుట నిలబడ్డారు.

Telugu News Dance In Marriage.. Fell Down Into Drainage Punjab Hoshiarpur.

ఈ క్రమంలో వరుడి స్నేహితులు డాన్స్ చేస్తూ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి దాటుతున్న సమయంలో అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వరుడితో సహా మరో 14మంది మురుగు కాల్వలో పడ్డారు. వారిని బయటకు తీసిన బంధువులు, ఫంక్షన్ హాల్ సిబ్బంది వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణం ఫంక్షన్ హాల్ యాజమాన్యమేనని వరుడి బంధువులు ఆందోళన చేపట్టడంతో.. ఫంక్షన్‌ హాల్‌ యాజమాన్యం వరుడి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

Telugu News Dance In Marriage.. Fell Down Into Drainage Punjab Hoshiarpur