డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు కన్నుమూత

December 2, 2017

‘లవకుశ’, ‘సీతారామ కళ్యాణం’, ఆదిత్య 369’ ,‘పౌర్ణమి’ వంటి హిట్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన ధర్మరాజు (97) ఇకలేరు. గత  కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  చెన్నై నస్రుల్లాబాద్‌లోని అంకోల్ క్యాంపులో మృతి చెందారు.ధర్మరాజు తన 20వ ఏట నుంచి డ్యాన్స్‌పై ప్రేమతో తన బాబాయి అయిన బీఏ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. చైన్నైలో స్థిరపడిన ధర్మరాజు  ‘లవకుశ’, సీతారామ కళ్యాణం’, ‘ఆదిత్య 369’ , ‘పౌర్ణమి’ సినిమాలతో పాటుగా దాదాపుగా వంద సినిమాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు .సినీ రంగానికి  చెందిన కృపావతిని వివాహం చేసుకున్నారు.

ధర్మరాజు ఎన్టీఆర్, కృష్ణ, మహేశ్ బాబు, ఉదయభాను, జూ.ఎన్టీఆర్, పలువురు హీరోల చేత క్లాసికల్ నృత్యం చేయించారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు నృత్యం నేర్పించారు. హాంకాంగ్, హైదరాబాద్‌కు చెందిన పలువురు ఇతని వద్ద  శిక్షణ తీసుకుని ఎంతోమందికి నృత్యం నేర్పుతున్నారు. ధర్మరాజు మరణవార్త విన్న ప్రభుదేవా అంకోల్ క్యాంప్‌కు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆనతంరం ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. గురువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.