డాన్స్ చెయ్యలేదని బాలుడ్ని చితకబాదిన డాన్స్ మాస్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

డాన్స్ చెయ్యలేదని బాలుడ్ని చితకబాదిన డాన్స్ మాస్టర్

February 24, 2018

పిల్లలను స్కూలుకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన రోజులు వచ్చాయి. టీచర్లు, ఆయాలు ఇలా ఎవరో ఒకరు విద్యార్థుల పట్ల చాలా కర్కషంగా వ్యవహరిస్తున్న తీరు కలకలం రేపుతోంది. చట్టాలెంత కఠినతరం అయినా ఇలాంటి దురాగతాలకు అంతు లేకుండా పోతోంది.

డాన్స్ సరిగ్గా చెయ్యలేదని ఓ డాన్స్ మాస్టర్ విద్యార్థి మీద అతి దారుణంగా దాడి చేశాడు. పశువును బాదినట్టు బాదాడు. దీంతో ఆ బాలుడి చేయి విరిగి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నగరంలోని ఉప్పల్ న్యూ విజయపురి కాలనీలోని సృజన స్కూల్‌‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. డ్యాన్స్ సరిగా చేయడం లేదని ఒకటో తరగతి విద్యార్థి రాహుల్‌‌ను డ్యాన్స్ మాస్టర్ తీవ్రంగా కొట్టాడు.

దీంతో చిన్నారి రాహుల్‌‌ చేయి విరిగింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు స్కూల్‌‌కు చేరుకుని రాహుల్‌‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా డ్యాన్స్ మాస్టర్ తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. అతణ్ణి అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 గత నెలలో సరూర్‌నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో  బాలిక సరిగా డ్యాన్స్ చేయలేదని డ్యాన్స్ మాస్టర్ చితకబాదిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకూ స్కూల్ యాజమాన్యం మాస్టర్‌‌పై చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.