భార్యతో డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్యతో డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు

March 6, 2018

మృత్యువు ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు ? యవ్వనంగా వున్నవా.. ఆనందంగా వున్నావా.. అనేవాటితో ప్రమేయం లేకుండా కబళించి కుటుంబాల్లో తీరని విషాదం నింపటమే దాని పని. అలాంటి హృదయవిదారక ఘటన రాజస్తాన్‌లోని బార్మర్‌లో జరిగింది. పెళ్లి వేడుకలో అందరూ ఆనందంగా వున్నారు. తన భార్యతో కలిసి ఆ ఆనందాన్ని ఇంకాస్త రెట్టింపు చేసుకుందామనుకున్నాడు ఆ భర్త. కానీ అతనికేం తెలుసు ఇదే చివరి ఆనందమని ? తన భార్య చేయిపట్టుకొని ఆనందించటం ఇదే ఆఖరుసారని అతనికి తెలీదు. స్టేజీ ఎక్కి దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలోని ‘ తుజే దేఖాతో యే జానా సనమ్ ’ పాట మీద డాన్స్ చేస్తున్నాడు. వారి డాన్స్‌ను చూస్తూ బంధువులందరూ సంతోషంలో మునిగిపోయారు.

ఇంతలో భర్త ఒక్కసారిగా స్టేజీపై కుప్పకూలిపోయాడు. క్రిందపడ్డ భర్తను చూసి భార్య తనను ఆట పట్టిస్తున్నాడని అనుకుంది. ఆమె ఇంకా డాన్స్ చేస్తూనే ‘ ఆట పట్టించింది చాలు.. లేవండి ’ అన్నట్టు భర్త చేయి పట్టి లాగింది. అతను ఎంత ఊపినా లేవకపోవటంతో ఆమె కంగారు పడింది. బెలూన్ల మీద పడ్డ అతను సెకెండ్ల వ్యవధిలోనే ప్రాణాలు వదిలాడు. ఒక్కసారిగా బంధువులందరూ గొల్లుమన్నారు. మృత్యువు ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఆసుపత్రికి తరలించినప్పటికీ అతను చనిపోయినట్టు, గుండెనొప్పి కారణంగాగనే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు దృవీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.