అజిత్ రీల్ హోరోనే కాదు రియల్ హీరో కూడా… సెట్లో డాన్సర్ చనిపోతే…

హీరోలంటే సినిమాల్లో వీరోచితంగా పోరాడుతారు. ప్రేమను పంచుతారు.. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకుంటారు.. విలన్‌ను మట్టి కరిపిస్తారు.. కష్టాలకు ఎదరురీది పోరాదడుతారు. నిజమే.. మరి తెరమీద హీరోయిజాన్ని పండించిన హీరోలు నిజ జీవితంలో కూడా అంతే ఉదారంగా వుంటారా  అనేది ప్రశ్న ? ఆ ప్రశ్నకు తమిళ హీరో అజిత్ సమాధానంగా నిలిచాడు. అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’ షూటింగ్ పూణేలో జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది.

Telugu news Dancer dies tragically on 'Viswasam' sets - Thala Ajith's immediate action

సినిమా షూటింగ్‌లో భాగంగా పాట చిత్రీకరణ జరుగుతోంది. నృత్య కళాకారుడు ఓవియన్‌ శరవణన్‌‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఆయన, సెట్‌లోనే కుప్పకూలాడు. అతణ్ణి వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనంలేకుండా పోయింది. అతణ్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేంత వరకు దగ్గరున్న అజిత్, తన సొంత ఖర్చులతో మృతదేహాన్ని విమానంలో చెన్నైకి చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆపై అతని కుటుంబానికి అండగా నిలిచారు. తన వంతుగా రూ. 8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి, రియల్ హీరోగా నిలిచాడు.

Telugu news Dancer dies tragically on ‘Viswasam’ sets – Thala Ajith’s immediate action