ఎన్నికల  బస్సుపై నక్సల్స్ దాడి.. ఐదుగురి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల  బస్సుపై నక్సల్స్ దాడి.. ఐదుగురి మృతి

November 8, 2018

ఛత్తీస్‌గఢ్ మళ్లీ నెత్తురోడింది. కూంబింగుకు వెళ్తున్న పోలీసులకు, అడవుల్లోని మావోయిస్టులకు మధ్య సాగుతున్న పోరులో ఈసారి అమాయక ప్రజలు బలయ్యారు. గురువారం దంతెవాడ జిల్లాలోని బచేలీ సమీపంలో బస్సుపై బాంబు దాడికి పాల్పడ్డారు మావోయిస్టులు. ఈ ఘటనలో నలుగురు పౌరులు, ఒక  సీఐఎస్ఎఫ్‌‌ జవాన్ చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ బస్సు ఎన్నికల విధుల కోసం వెళ్తోందని, దాడిలో డ్రైవర్, కండక్టర్, ఇద్దరు ప్రయాణికులు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎక్కిన జవాన్లకు ఎన్నికల విధులతో సంబంధం లేదని చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక్క రోజు ముందే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. అక్టోబరు 30 పోలీసులతోపాటు వచ్చిన విలేకర్లపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్గఢ్‌లో‌ ఈ దాడులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.

 నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మావోయిస్టుల దాడి అధికారులకు సవాల్గా మారింది.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక్క రోజు ముందే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. రాష్ట్రంో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో నక్సల్స్‌‌ ప్రభావం ఎక్కువగా ఉన్న 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 12 తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.  నవంబరు 20 మిగతా 72 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.