ఇది ఓ తండ్రి మనోవేదనా? లేక పిచ్చి చేష్ట..? - MicTv.in - Telugu News
mictv telugu

ఇది ఓ తండ్రి మనోవేదనా? లేక పిచ్చి చేష్ట..?

February 22, 2018

కూతురు లేచిపోయిందని ఆమెకు ఓ తండ్రి  ఏకంగా దహన సంస్కారాలు జరిపి పిండం పెట్టాడు. ఇది ఓ తండ్రి మనోవేదన అనుకోవాలా? లేక మూర్ఖత్వంతో అతని పిచ్చి చేష్ట అనుకోవాలా? ఇన్నాళ్లు కూతురిని కంటికి రెప్పలా కాపాడిన తండ్రికి సపోర్ట్ చేయాలా? మనసుకు నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకున్న ఆమె ప్రేమకు సపోర్ట్ చేయాలా?వేలూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. జిల్లాలోని వానియంబాడి దగ్గరలో ఉన్న గ్రామంలో ఓ యువతి ఒకరిని ప్రేమించి  పెద్దలు అంగీకరించక పోవడంతో అతనితో కలిసి జీవితాన్ని పంచుకోవాలని…ఇంట్లో చెప్పకుండా అతనితో వెళ్లి.. పెళ్లి చేసుకుంది. చుట్టు ప్రక్కల వారు  మీ కూతురు లేచిపోయిందంటగా అని కాకులై  అరుస్తుంటే  ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. నా కూతరు  చనిపోయింది దహన సంస్కారాలకు రండి అంటూ పోస్టర్లు కొట్టించాడు. అంతేకాదు గ్రామస్థులు, కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో కూతురికి అంత్యక్రియలు జరిపి పిండం పెట్టాడు. కొందరేమో తండ్రి బాధను, కోపాన్ని అర్థం చేసుకుంటుంటే, మరికొందరేమో మూర్ఖత్వంతో కూతురి ప్రేమనే కాదు, అంత్యక్రియల పేరుతో కూతురినే చంపుకుంటున్నాడు అని విమర్శిస్తున్నారు.