నాన్న పెట్టిన పార్టీపై  కూతుర్ల  ట్వీట్లు! - MicTv.in - Telugu News
mictv telugu

నాన్న పెట్టిన పార్టీపై  కూతుర్ల  ట్వీట్లు!

February 22, 2018

నిన్న మధురైలో భారీ బహిరంగసభ పెట్టి  కమల్ తన రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి ‘మక్కల్ నీది మయ్యం’ అనే పేరు పెట్టాడు కమల్. డిల్లీ సియం కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే కమల్‌హాసన్ కూతుర్లు తమ తండ్రికి ట్విటర్ సాక్షిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ‘తన జీవితంలో నూతనోధ్యాయం ప్రారంభించిన మా నాన్నకు శుభాకాంక్షలు, మీరు అభిమానించే గాంధీజీ స్ఫూర్తిగా ముందుకు సాగిపోవాలి నాన్న. ఇప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు. వారికి మీరు అండగా ఉంటారని ఆశిస్తున్నా’అని శ్రుతి హాసన్‌ ట్వీట్ చేసింది.కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా‘ ప్రియమైన నాన్నకు… మీ రాజకీయ ఎంట్రీ గర్వ పడాల్సిన అంశం. ఒక వ్యక్తిగా మీరు విజయం సాధించారు. ఇప్పుడు ప్రజలతో మమేకమై మరిన్ని విజయాలు సాధించాలి. ఒక పౌరుడిగా అది మీ బాధ్యత’ అని ట్వీట్‌ చేసింది.