హైదరాబాద్‌లో సెలబ్రిటీ హత్యకు దావూద్ కుట్ర - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో సెలబ్రిటీ హత్యకు దావూద్ కుట్ర

February 21, 2018

అంతర్జాతీయ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నసంగతి తెలిసిందే. డీ-గ్యాంగ్ తాజాగా హైదరాబాద్‌లో ఓ ప్రముఖ వ్యక్తి తలకు 45 లక్షల రూపాయలు వెలకట్టి షార్ప్ షూటర్‌ని రంగంలోకి దించింది. గత  ఏడాది నవంబర్‌లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు షార్ప్‌ షూటర్‌ నసీం అలియాస్‌ రిజ్వాన్‌‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీసులు అతనిని విచారిస్తున్నారు.ఈ విచారణలో హైదరాబాద్‌లోని సెలబ్రిటీని డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిందన్న విషయాన్ని నసీం బయటపెట్టాడు. ఆ సెలబ్రిటీని చంపేందుకు దావూద్ నమ్మిన బంటు చోటా షకీల్‌‌తో 45 లక్షల రూపాయల సుపారీకి ఒప్పందం చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది.  ఈ డీల్‌‌లో ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన గ్యాంగ్‌ స్టర్‌ మున్నాసింగ్‌‌తో కలసి చేయాలని షకీల్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్నాసింగ్‌ను నసీం కలిసే ప్రయత్నాల్లో ఉన్నాడని నసీం అనుచరుడు జునైద్ చౌదరి  తెలిపిన పక్కా సమాచారంతో అతనిని ఢిల్లీ పోలీసులు గుర్గావ్‌లో అరెస్టు చేశారు.

ఈ ఆపరేషన్ లో హైదరాబాద్ సెలబ్రిటీతో పాటు పాక్‌‌లో పుట్టి కెనడియన్‌‌గా మారిన రచయిత తారిఖ్‌ ఫథా, ‘కాఫీ విత్‌ డీ’ సినిమా నిర్మాత, మరికొందరు సెలబ్రిటీలను,  తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ తదితరులను చంపేందుకు 1.5 కోట్ల సుపారీ మాట్లాడుకున్నట్టు పోలీసుల విచారణలో తెలింది. కాగా, హైదరాబాద్‌లో డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిన ప్రముఖుడు ఎవరు? అతడినే  టార్గెట్‌ చేయాల్సిన అవసరం డి–కంపెనీకి ఎందుకు వచ్చింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.