హైదరాబాద్ సదస్సుకు రానన్న దీపిక - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ సదస్సుకు రానన్న దీపిక

November 21, 2017

ఈనెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సుకు బాలీవుడ్ నటి దీపికా పదుకునే, క్రికెటర్ ధోని హాజరు కాబోమని చెప్పారు. అత్యంత అట్టహాసంగా నిర్వహించనున్న పారిశ్రామికవేత్తల ఈ శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. క్రీడారంగం నుంచి సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్ హాజరు కానున్నారు. కాగా ‘హాలీవుడ్ టు నాలీవుడ్ టు బాలీవుడ్’ అనే అంశంపై దీపికను ప్రసంగించాల్సిందిగా ఆహ్యానించారు.అందుకు దీపిక తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ రానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భాగ్యనగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ సదస్సుకు ఓ దక్షిణాసియా దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.