తల్లి ప్రేమకు కరిగి కన్నీరైపోయిన దీపిక - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి ప్రేమకు కరిగి కన్నీరైపోయిన దీపిక

November 27, 2017

ఎనలేని తల్లి ప్రేమకు ఎంతటివారైనా కరిగి కన్నీరావాల్సిందే. అందుకు దీపికా పదుకునే మినహాయింపు కాదు. తల్లి తన గురించి రాసిన ప్రేమపూర్వక పదాలకు, వెలకట్టలేని అమ్మ అపురూప వాక్యాలకు దీపిక గుండె కరిగి కన్నీటి ధార అయింది. ఈ అద్వితీయమైన సంఘటన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వ్యాఖ్యాత‌గా కొత్త‌గా ప్రారంభ‌మైన ‘ బాతే విత్ ద బాద్‌షా ‘ కార్య‌క్ర‌మంలో చోటు చేసుకున్నది.

ఈ కార్యక్రమానికి మొద‌టి అతిథిగా న‌టి దీపికా ప‌దుకునే హాజ‌రైంది. స‌ర‌దా స‌ర‌దా విష‌యాల‌తో పాటు కొన్ని ప్ర‌త్యేక హంగుల‌తో రూపొందించిన ఈ టాక్ షోలో దీపికా భావోద్వేగానికి గురైంది. త‌న త‌ల్లి ఉజ్జ‌లా ప‌దుకునే రాసిన లేఖ‌ను షారుక్ చ‌ద‌వ‌గానే దీపిక తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆ లేఖలో కూతురు మీదున్న తన ప్రేమను, దీపిక అనుకున్నది సాధించడానికి ఎదురుకున్న అడ్డంకుల తర్వాత సాధించిన విజయాలు, ఆ విజయాల వెనుక ఆమె కృషి, పట్టుదలను వర్ణిస్తూ లేఖలో పేర్కొన్నది.

దీంతో దీపికా ఒక్క‌సారిగా కంట‌త‌డి పెట్టుకున్నారు. ఈ భావోద్వేగ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో చివరగా దీపిక పద్మావతి సినిమా విమర్శల గురించి స్పందించింది. విమర్శలు తనకివాళ కొత్త కాదు. విమర్శలే తనకు కొత్త విషయాలు నేర్పిస్తాయి. వీటివల్ల తనకు మానసికి పరిణతి చెందినట్టుగా అనిపిస్తుందని చెప్పింది.