మొగుడి మీసాలకు దీపిక కత్తెర…వీడియో

కింగ్‌లాంటి మొగోడిని అయినా కొంగుకు కట్టేసుకోగలరు ఆడవారు… అనే సామెత మీరు వినే ఉంటారు. ఇందుకు సెలెబ్రిటీలు కూడా అతీతం కారు. దీనికి నిదర్శం ఈ వీడియో. ఇటీవల బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకొనె, రణవీర్ సింగ్‌ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. నిన్ననే నవ వధూవరులు స్వదేశానికి వచ్చారు.

పెళ్ళైన నాలుగు రోజులలోపే రణవీర్ కంట్రోల్ అంతా దీపికా చేతుల్లోకి వెళ్ళిపోయిందేమో అంటున్నారు జనం. దీనికి ఉదాహరణగా  ఓ వీడియోలను చూపుతున్నారు. రణవీర్ ఏంతో ఇష్టంగా పెంచుకున్న కోరమీసాలను దీపిక కత్తెరతో కట్ చేసి.. ప్రపంచాన్ని గెలిచినంత సంబరపడింది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజున హల్ చల్ చేస్తున్న ఈ వీడియో నిజానికి పాతది. అయితే రణ్‌వీర్ పెళ్లిలో కోరమీసాలతో కనిపించడంతో అది నిన్నో మొన్నో తీసిన వీడియో అని జనం పొరబడుతున్నారు.

Telugu News deepika padukone cuts ranveer singh mustache