నీళ్లు ఇవ్వలేదని కూతుర్ని చంపేసిన తాగుబోతు - MicTv.in - Telugu News
mictv telugu

నీళ్లు ఇవ్వలేదని కూతుర్ని చంపేసిన తాగుబోతు

February 10, 2018

క్షణికావేశాల్లో చేస్తున్న నేరాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. అడిగిన వెంటనే మంచినీళ్లు తీసుకురాలేదంటూ పట్టలేని కోపంలో ఎనిదేళ్ల కూతురిని ఓ తండ్రి  పాశవికంగా కొట్టాడు. మూడు రోజులు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి  శుక్రవారం మరణించింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

తూర్పు ఢిల్లీలోని  అశోక్ నగర్‌కు చెందిన అబ్దుల్ గత మంగళవారం బోజనం చేస్తున్న సమయంలో మంచినీళ్లు తీసుకురమ్మని కూతురు రుక్షర్‌కు చెప్పాడు. ఆ పాప నీళ్లు తేవడంతో కాస్త ఆలస్యం చేసింది. అంతే.. అబ్దుల్ రాక్షసుడిలా మారిపోయాడు.  చిన్నారిని విపరీతంగా కొట్టాడు. అంతటితో ఊరుకోకుండా గొంతు నులిమి పైకెత్తి రోడ్డుపైకి విసిరేశాడు. తీవ్రంగా గాయపడిన రుక్షర్ ను తల్లి ఆస్పత్రిలో చేర్పించింది.

కూతురిని  భ‌ర్త కొడుతున్న‌ప్పుడు తాను వేరే గ‌దిలో ఉన్నాన‌ని, అరుపులు విని లోప‌లికి వ‌చ్చాన‌ని  త‌ల్లి పోలీసుల‌కు చెప్పింది. రోడ్డు మీద‌కు విసిరేస్తున్న‌ప్పుడు అడ్డుకోబోతే త‌న‌ను కూడా కొట్టాడ‌ని తెలిపింది. అత‌ను తరచూ మ‌ద్యం సేవించి త‌నను  కూడా కొడుతుంటాడ‌ని వివ‌రించింది. పోలీసులు అబ్దుల్‌ను అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు.