ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. సచివాలయంలోని మూడో అంతస్తులో ఈ దాడి జరగడం ఢిల్లీలో తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యాహ్న భోజన సమయం కావడంతో కేజ్రీవాల్ తన గదిలో నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు తనవెంట తెచ్చుకున్న సిగరెట్ ప్యాకెట్లోని కారంపొడిని కేజ్రీవాల్ ముఖంపై చల్లాడు..సీఎంను చంపేస్తానని కేకలు వేశాడు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. కేజ్రీవాల్ కళ్ళజోడు కింద జారిపడి పగిలిపోయింది. సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై సీఎంను పక్కకు జరిపారు.
How can any random person walk into the Secretariat and attack the Chief Minister. @ArvindKejriwal has faced many such attacks on regular basis. This is a serious security lapse : @Saurabh_MLAgk pic.twitter.com/39RhNHwStD
— AAP (@AamAadmiParty) November 20, 2018
అనిల్ కుమార్ శర్మ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడని అధికారులు వెల్లడించారు. నిందితుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెక్రటేరియట్‌లోకి ప్రవేశించి, మూడో అంతస్తులోని కేజ్రీవాల్ కార్యాలయం బయట వేచి చూశాడని తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని తెలుపుతోందని ఆప్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఓసారి ఇంక్ దాడి, మరోసారి ఓ అగంతకుడు కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించాడు. ఇలా దాడులు జరగడం కేజ్రీవాల్‌కు కొత్త కాదు.
Telugu news Delhi Chilli powder is thrown at CM Arvind Kejriwal inside sec…