నన్ను కొట్టనంటేనే వస్తా !   - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను కొట్టనంటేనే వస్తా !  

February 27, 2018

‘నన్ను కొట్టనంటేనే కేబినేట్ మీటింగ్ కు వస్తా’ ఈ మాట చెప్పిది ఎవరో కాదు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్. ఆయనపై  ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసిన తర్వాత ఆయన చాలా కలత చెందారు. ఢిల్లీ ముఖ్యమంత్రి  బడ్జెట్ సెషన్స్‌పై చర్చించేందుకు  సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అందుకోసం సీఎం కేజ్రీవాల్  సీఎస్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ‘ప్రభుత్వ పాలన సజావుగా సాగాలని,ఢిల్లీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని ప్రస్తావించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను చర్చిచేందుకు తాను, ఇతర అధికారులు సమావేశానికి వస్తున్నామని, సీఎస్‌ను కూడా రావాలని  తెలియజేశారు.అయితే దీనిపై స్పందించిన సీఎస్ ‘ఈ సమావేశానికి వచ్చినప్పుడు తమపై ఎలాంటి దాడి జరగదని సీఎం హామీ ఇస్తేనే వస్తానని అన్షు ప్రకాష్ స్పష్టం చేశాడు. సమావేశం హుందాగా నడవాలని కోరుకుంటున్నామని సీఎంకు రాసిన లేఖలో రాశారు. ఇప్పుడీ లెటర్ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సియం కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో మరి.