కోర్టుకెక్కిన ఢిల్లీ పటాకుల వ్యాపారులు…!

ఢిల్లీలో కాలుష్యం కారణంగా దీపావళి పటాకులు అమ్మకాలను కోర్టు నిషేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధంపై  కొందరు వ్యాపారులు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాణసంచా నిషేదంపై ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాల్సిందిగా కోర్టును కోరారు. బాణసంచా కొనుగోలు కోసం అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాం. నిషేదం వల్ల చాలా డబ్బు నష్టపోవాల్సివస్తుందని  సుప్రీంకోర్టుకు పెట్టిన పిటీషన్‌లో ట్రేడర్లు పేర్కొన్నారు. వ్యాపారులు పిటీషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, నిషేదం విధించిన న్యాయమూర్తితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. మరి కోర్టు వ్యాపార్థుల నష్టాల్ని పరిగణలోకి తీసుకుంటుందా? లేక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, నిషేదాన్ని అలాగే కొనసాగిస్తుందా అనేది చూడాలె మరి.

SHARE