హనుమంతుణ్ని హెలికాప్టర్లో తీసుకెళ్లండి.. - MicTv.in - Telugu News
mictv telugu

హనుమంతుణ్ని హెలికాప్టర్లో తీసుకెళ్లండి..

November 21, 2017

ఢిల్లీ నగరం మధ్యలో ఉన్న 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆ ప్రాంతం నుంచి తొలగించాలని హై=కోర్టు ఆదేశించింది. ప్రజలకు ఎలాంటి  ఇబ్బందులూ కలుగకుండా విగ్రహాన్ని ఎయిర్‌లిఫ్ట్ చేయాలని తీర్పునిచ్చింది. హనుమాన్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ప్రదేశాలు దురాక్రమణకు గురయ్యాయని, ఓ ఎన్‌జీవో దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించింది. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఉంది. అక్కడికి భక్తుల తాకిడి ఎక్కవగా ఉంటోంది. దేవుడిని అసరగా చేసుకుని ఆ ప్రాంతలోని కొన్ని ప్రదేశాలపై కొందరు ఆక్రమించారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు హనుమంతుడి  విగ్రహాన్ని హెలికాప్టర్ ద్వారానో లేకపోతే విమానం ద్వారానో ఎయిర్ లిప్ట్ చేసి మరో చోట ప్రతిష్టించాలని తీర్పు చెప్పింది. అందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని   తెలిపింది.