దారి మరిచిపోయిన రైలు.. - MicTv.in - Telugu News
mictv telugu

దారి మరిచిపోయిన రైలు..

November 22, 2017

మనుషులు దారి తప్పిపోవడం  విన్నాం. కొన్ని చోట్ల కుక్కలు వంటివి కూడా దారి తప్పుతుంటాయి. కానీ  రైలు దారి తప్పి పోవడం విన్నారా?  ఆశ్చర్యంగా ఉంది కదా ? కానీ అదే జరిగింది. మహరాష్ట్రకు వెళ్లాల్సిన రైలు..  దారి  తప్పి మధ్యప్రదేశ్‌‌కు వెళ్లింది.  అందులో ప్రయాణిస్తున్న 1500 మంది రైతులు ఆందోళన చెందారు.రైతులు దేశం నలుమూలల నుంచి రైతులు  సోమవారం ఢిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద కిసాన్ యాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి వచ్చారు. ర్యాలీ ముగించుకుని తిరిగి మహారాష్ట్ర వెళ్తుండగా రైలు మార్గమధ్యంలో దారి తప్పింది. ఏకంగా 160 కి.మీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని బాన్మోర్  స్టేషన్‌కు చేరుకుంది. ఏం జరుగుతోందో తెలీక  రైతులు ఆందోళన తలలు పట్టుకున్నారు.

మథుర స్టేషన్ వద్ద రైల్వే అధికారి తప్పుడు సంకేతం ఇచ్చాడని, అందువల్లే రైలు దారి తప్పిందని సమాచారం. ఈ ఘటనలో రైతులు ఆందోళన చెందుతున్నా రైల్వే అధికారులు స్పందించలేదని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.