అక్కడ మార్నింగ్‌ వాక్ చేస్తే అంతే... - MicTv.in - Telugu News
mictv telugu

అక్కడ మార్నింగ్‌ వాక్ చేస్తే అంతే…

November 3, 2017

ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది  ఉదయం పూట నడుస్తూ ఉంటారు.  కానీ  ఢిల్లీలో మాత్రం ఉదయాన్నే బయట నడవడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఉదయం తాజా గాలి దొరుకుంది కదా, వాకింగ్ చేద్దాం అనుకుంటే ప్రాణాలకే ముప్పని  వైద్యులు చెబుతున్నారు.

మార్నింగ్’వాక్  ఏ ప్రాంతంలోనైనా చేస్తే మంచిదేమో ,కానీ ఢిల్లీలో ఎంత మాత్రం శ్రేయస్కరం కాదట.  ఢిల్లీలో కాలుష్యం అధికంగా ఉంది. ఆ కాలుష్యం కారకాలు గాలిలో కలిశాయి.  ధూళి కణాల సంఖ్య 2.5 శాతం ఉందని,మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పని సామర్థ్యం తగ్గిపోతుందని తెలిపారు. దీంతో శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తుతాయని , ఉదయం పూట ఢిల్లీ ప్రజలు ఇంటిలోనే ఉండాలని ప్రముఖ వైద్యులు అప్రమత్తం చేశారు.