బాలికను కాపాడ్డానికి ‘వేశ్యాగృహం’ నడిపిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

 బాలికను కాపాడ్డానికి ‘వేశ్యాగృహం’ నడిపిన పోలీసులు

November 24, 2017

ఢిల్లీ పోలీసులు సినీ ఫక్కీలో మైనర్‌ బాలికను వేశ్యా గృహానికి అమ్మబోయిన ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారిద్దరు బిహార్ రాష్ట్రానికి చెందినవారిగా వెల్లడించారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘వేశ్యా గృహాన్ని నడుపుతున్నామంటూ  ఓ మొబైల్‌ నంబర్‌ను మేమే ఇంటర్నెట్‌లో పెట్టాం. ఆ నంబరుకు పెద్ద ఎత్తున అమ్మాయిలను అమ్ముతామని ఫోన్లు వస్తున్నాయి.  అది నిజంగానే వేశ్యా గృహానికి చెందిన నంబర్ అనుకుని  అమర్‌ (24), రంజీత్‌‌షా (27)లు మైనర్‌ బాలిక అమ్మకానికి ఉన్నట్లు ఫోన్‌ చేసి చెప్పారు. మా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కూడా ఏమాత్రం వాళ్లకు అనుమానం రాకుండా చాలా తెలివిగా మాట్లాడి రూ. 2.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. తొలుత న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ వద్ద డబ్బును ఇవ్వాలని అనంతరం గుడ్‌గావ్‌లోని ఇఫ్‌కో చౌక్‌లో బాలికను అందజేస్తామని మాతో  ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ వద్ద డబ్బు కోసం వేచి ఉన్న ఇద్దరిని పట్టుకున్నాం’ అని చెప్పారు.

బిహార్‌లో బాలికను ప్రేమించానని నమ్మించిన అమర్‌.. ఆ అమ్మాయి ఢిల్లీకి వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అక్టోబరులో ఢిల్లీకి వచ్చిన ఆమెపై రంజిత్ షా, అమర్‌లు పలుమార్లు అత్యాచారం చేసినట్టు తెలిపారు. గురైన అమ్మాయిని పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.