తలకు చేసే ఆపరేషన్‌ను కాలికి చేసిన వైద్యుడు - MicTv.in - Telugu News
mictv telugu

తలకు చేసే ఆపరేషన్‌ను కాలికి చేసిన వైద్యుడు

April 24, 2018

ఒకరికి చేయాల్సిన వైద్యం,మరోకరికి చేశాడు ఓ వైద్యుడు. ఈ ఘటన ఢిల్లీలోని సుశ్రిత ట్రామా సెంటర్‌లో జరిగింది. విజేంద్ర త్యాగి అనే అతనికి  ప్రమాదంలో తలకు,ముఖానికి గాయాలు కావడంతో సుశ్రిత ఆస్పత్రిలో చేరాడు.అదే సమయంలో వీరేంద్ర అనే వ్యక్తి కాలు విరిగి అదే వార్డులో చేరాడు.ఇద్దరి పేర్లతో  తికమకపడ్డ వైద్యుడు ఏప్రిల్ 19న వీరేంద్రకు చేయాల్సిన ఆపరేషన్‌ను విజేంద్రకు చేశాడు. కాలికి శస్త్ర చికిత్స చేసి,అందులో రాడ్ ఉంచాడు. ఆపరేషన్ తర్వాత జరిగిన  పొరపాటును విజేంద్ర కొడుకు అంకిత్ త్యాగి గుర్తించాడు. తన తండ్రికి తలకు చేయాల్సిన ఆపరేషన్‌‌కు బదులు కాలికి ఆపరేషన్ చేశారని ఆస్పత్రికి వైద్యుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో  ఆస్పత్రి మేనేజ్ మెంట్ సదురు వైద్యుడిపై చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి సూపర్ విజన్ లేకుండా ఆపరేషన్లు చేయకూడదని తెల్చి చెప్పారు. కాగా తన తండ్రికి ఇప్పటికీ తలనొప్పి తగ్గకపోగా, వైద్యుడు చేసిన పనితో నడవలేకపోతున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.