మహిళా జడ్జిని కిడ్నాప్ చేయబోయి… - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా జడ్జిని కిడ్నాప్ చేయబోయి…

November 28, 2017

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై  అత్యాచారాలు, కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా  ఓ క్యాబ్ డ్రైవర్  ఏకంగా మహిళా న్యాయమూర్తినే కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వివరాల్లోకెళ్తే..

మహిళా జడ్జిని ఎక్కించున్న డ్రైవర్ ఆమె వెళ్లమని చెప్పిన  కర్‌కర్ దుమా కోర్టుకు కాకుండా వేరే మార్గంలోకి క్యాబ్ మళ్లించాడు.  జాతీయ రహదారి-24  వైపు కారును వేగంగా తోలాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే ఫోన్లో  పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్  కొంతదూరం వెళ్లాక  మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. కారును వెంబడించిన పోలీసులు మాజిపుర్ టోల్ ప్లాజా వద్ద డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిసింది.