ఎర్రసముద్రరాజతనయ.. అలల్లో ప్రసవం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రసముద్రరాజతనయ.. అలల్లో ప్రసవం..

March 15, 2018

సముద్ర అలల్లో  ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఈజిప్టులోని  దహాబ్ రెడ్ సీ సముద్ర తీరప్రాంతంలో చోటు చేసుకుంది. రష్యాకు చెందిన ఒక గర్భిణి  సముద్ర తీరంలో అలల్లో ఆనందంగా ఆడుకుంటున్న సమయంలో ఒక శిశువుకు జన్మనిచ్చింది.  ప్రసవానికి ఓ డాక్టర్, ఆమె భర్త సహకరించారు.  శిశువును సురక్షితంగా నీటిలో నుంచి బయటికి తీసుకొచ్చారు. ఈ దృశ్యాలను సమీపంలో ఉన్నవారు తమ కెమెరాలలో బంధించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవజాత శిశువును ఒక టబ్బులో ఉంచి బయటకు తీసుకువచ్చారు. డెలివరీ అనంతరం ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. దహాబ్ తీరంలో ప్రసవాల కోసం తరచూ విదేశీయలు వస్తుంటారని, తాాజా ప్రసవం కూడా అలాంటిదేనని భావిస్తున్నాయి. సముద్రంలో పుట్టిన శిశువు ఆడో, మగో తెలియడం లేదు.