ప్రజాస్వామ్యం గాయపడింది.. హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజాస్వామ్యం గాయపడింది.. హరీశ్ రావు

March 12, 2018

‘కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కక్షగట్టింది.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను పరిశీలించకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి నిరాధారణ ఆరోపణలు చేస్తోంది’ అని మంత్రి  హరీష్‌రావు మండిపడ్డారు. . అసెంబ్లీలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి హెడ్‌సెట్ విసరడం,  అది స్వామిగౌడ్‌ కంటికి తగలడంపై ఆయన స్పందించారు.‘ఇది చాలా హేయమైన చర్య. గవర్నర్‌ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. కాంగ్రెస్ దౌర్జన్యం తీరుతో  ప్రజాస్వామ్యానికి గాయమైంది. ఇది వారికి తగదు. కాంగ్రెస్ నేతలు ఇలా అసహనంతో దాడులు చేయటం సబబు కాదు. ఏమైనా వుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలి ’ అని హరీష్ రావు సూచించారు.

ఇదిలావుండగా గవర్నర్ ప్రసంగం లేనందువల్లే ఆవేదనతో తాము ఆందోళన చేశామని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై వివిధ పార్టీ నేతలతో స్పీకర్ మదుసూధనాచారి చర్చించారు.  ఏడాదిపాటు కోమటిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేయాలనే డిమాండ్ వినబడుతోంది.