కారుబాంబుతో జర్నలిస్టు హత్య  - MicTv.in - Telugu News
mictv telugu

కారుబాంబుతో జర్నలిస్టు హత్య 

October 17, 2017

నిజాలు రాసినందుకు పాత్రికేయులను రాజకీయ నాయకులు, మాఫియాలు, వ్యాపారులు  వేధించడం ప్రపంచమంతటా ఉన్నదే. తమకు వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని హెచ్చరించడం, వినకపోతే చంపడం షరా  మామూలే. మాల్టా దేశంలో తాజాగా అదే జరిగింది.

మహిళా జర్నలిస్టు డాఫ్నే కారునా గలిజియాను దారుణంగా హత్య చేశారు. ఆమె కారులో బాంబు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.  ఆమె ఇంటి  నుంచి బయలు దేరిన కొన్ని క్షణాలకే  ఆమె కారును బాంబుతో పేల్చారు. పేలుడు ధాటికి కారు ముక్కచెక్కలై పొలాల్లో పడిపోయింది.  53 ఏళ్ల డాఫ్నేమాల్టా రాజకీయాలపై చాలా వ్యాసాలను రాసి ప్రచురించింది. ఇటీవల వెలుగు చూసిన ఆర్థిక కుంభకోణం  పనామా పత్రాలపై అనేక కథనాలను రాసింది.  మాల్టా నేతలు విదేశాల్లో డబ్బును అక్రమంగా పెట్టారని ఆధారాలతో సహా బయటపెట్టింది.  మాల్టా  దేశ  ప్రధాని భార్యతో పాటు మరికొంత మంది రాజకీయ నాయకులకు  పనామా దేశంలో కంపెనీలు ఉన్నట్టు తెలిపింది.  

అజర్ బైజాన్‌కు చెందిన రాజవంశ కుటుంబం నుంచి మాల్టా దేశం ప్రధాని భారీగా ముడుపులు తీసుకున్నారని వెల్లడించింది.  ఈ నేపథ్యలో ఆమెకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో ఆమె రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  హత్యకు గురయ్యే ముందు కూడా డాఫ్నే తన బ్లాగ్‌లో ఓ వ్యాస్యాన్ని పోస్టు చేసింది.